www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

19వ శతాబ్దంలో హిప్నోజనాన్ని (హిప్నోబర్తింగ్) పరిచయం చేశారు. ప్రసూతి అంటే కలిగే భయాన్ని తొలగించి, ఉపశమనాన్ని కలిగించే పద్దతులను ఇందుకు ఉపయోగిస్తారు. గర్భిణులు ఉద్వేగం నుంచి బయటపడి తేలికపడిన స్థితికి చేరుకుంటారు. అప్పుడు శరీరం ఎటువంటి అసౌకర్యం లేకుండా శిశుజననానికి సిద్ధమవుతుంది.

ప్రక్రియ పద్దతి:

హిప్నోజనానికి సంబంధించిన అవగాహన తరగతులు వారానికి ఒకసారి రెండు గంటల పాటు ఉంటాయి. గర్భం దాల్చిన 30వ వారంలో మొదలై నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయి. సాధారణంగా హిప్నోథెరపిస్టు తల్లితో పాటు శిశుజనన సమయంలో ఉండలేడు. అందువల్ల నొప్పిని భరించగలగడానికి తమకు తామే హిప్నోసిస్ చేసుకోగలిగే విధంగా వాళ్లను తయారుచేస్తారు. ఉదాహరణకు తాము స్ప్రుహలో లేనట్టుగా, సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్టుగా ఊహించుకోవడం ద్వారా నొప్పి చాలా తక్కువ ఉన్నట్టుగా గుర్తించడం ఈ ప్రక్రియతో సాధ్యమవుతుంది.

హిప్నోథెరపీ లక్ష్యాలు:

  • నొప్పి తగ్గించే మందుల అవసరాన్ని తగ్గించడం
  • శిశుజననం జీవితంలో చాలా ప్రశాంతమైన ఘట్టంగా చేయడం
  • ప్రసూతి అలసటను తగ్గించడం
  • తల్లి, బిడ్డ, ఇతర సిబ్బంది అందరూ కలిసి దీనిలో పాలుపంచుకోవడం
  • లామేజ్ పద్దతుల కన్నా తక్కువ హైపర్ వెంటిలేషన్ ను అందించడం
  • సంప్రదాయ పద్దతుల స్థానంలో శాస్త్రబద్దమైన విధానాల ద్వారా శిశుజననానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.
ఉదాహరణలు
  • జనన శిక్షకులను జనన సహాయకులంటారు.
  • బిడ్డను పట్టుకోవడాన్ని, శిశువును గ్రహించడం అంటారు.
  • గర్భాశయ సంకోచాన్ని గర్భాశయ సర్జ్ అంటారు.

పరిమితులు

తల్లికి గాని, కడుపులోని భ్రూణానికి గాని హిప్నోథెరపీ వల్ల హాని కలుగుతుందని స్పష్టంగా ఇంతవరకు గుర్తించలేదు. కాని కొన్ని నష్టాలు మాత్రం ఉన్నాయి.

  • హిప్నాసిస్ విభాగానికి చెందిన వాళ్లలో ప్రసూతి సమయం ఎక్కువగా ఉంటునట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
  • హిప్నోసిస్ కోసం తగిన విధంగా తయారుచేయడానికి నొప్పి తగ్గించే ఇతర విధానాల కన్నా ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చాలా మంది ప్రసూతి వైద్యులు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
  • నొప్పి భరించగలిగే స్థాయిలో ఉండే హిప్నోసిస్ వల్ల జనన ప్రక్రియ గురించిన జ్ణాపకశక్తిని తగ్గిస్తుంది.

పైన తెలిపిన సమాచారం దిగువ సూచించిన ప్రచురణల నుంచి గ్రహించడమైనది.

మీకు హిప్నోథెరపీ గురించి మరింత సమాచారం కావాల్సి వస్తే www.hypnobirthing.com చూసి తెలుసుకోవచ్చు. చివరగా మీ ప్రసూతి వైద్యులతో చర్చించడం మంచిది.

ముర్రే ఎన్ కిన్, ఎ గైడ్ టు ఎఫెక్టివ్ కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, థర్డ్ ఎడిషన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2000

ఇయాపెన్ ఎస్, రాబిన్స్ డి, నాన్ ఫార్మకలాజికల్ మీన్స్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఫర్ లేబర్ అండ్ డెలివరీ, ఇంట్ అనెస్తీషియాలజీ క్లినిక్ 2002 ఫాల్, 40 (4): 103-14, రివ్యూ

మెకాలే ఎ, రాండమైజ్డ్ ట్రయల్ ఆఫ్ సెల్ఫ్ హిప్నాసిస్ ఫర్ అనల్జీసియా ఇన్ లేబర్, బిఆర్ మెడ్ జె, 292:657, 1986


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD