www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth



కాళ్లు కదిలించే సామర్థ్యానికి ఆటంకం కలుగకుండా నొప్పి తగ్గించడమే అనస్తీషియాలజిస్టుల లక్ష్యం. అంటే మీకు నొప్పి లేకుండా ఉండడమేగాక ఎపిడ్యురల్ అనల్జీసియా ఇచ్చినప్పటికీ కాళ్లను హాయిగా కదిలించగలుగుతారు. ఎపిడ్యురల్ కు సంబందించిన కొత్తపద్ధతి వాకింగ్ ఎపిడ్యురల్(నడక ఎపిడ్యురల్). (వాకింగ్ ఎపిడ్యురల్ విభాగన్ని చూడండి) దీనివల్ల రోగి ప్రసూతి సమయంలో నిలబడటమేగాక చక్కగా నడవగలుగుతారు కూడా. అయితే కొన్ని ఆస్పత్రి విధానాల ప్రకారం ఎపిడ్యురల్ తీసుకున్న తరువాత నడవడాన్ని వ్యతిరేకిస్తారు.

ఎపిడ్యూరల్ ద్వారా ఇచ్చే స్థానిక అనస్టెటిక్ మందులు ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అవసరమవుతాయి. కొన్నిసార్లు కాళ్లు బలహీనం అయిపోయి నడవడం కష్టమవుతుంది. ప్రసూతి నర్సు సహాయంలో అనస్తీషియాలజిస్టు లోకల్ అనెస్తెటిక్ మందులు ఎపిడ్యురల్ ద్వారా ఇవ్వవలసిన అవసరాలను పర్యవేక్షిస్తుంటాడు

 


తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD