www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

ఎపిడ్యూరల్ అనస్తీషియా ప్రసూతి సమయాన్ని కొద్దిగా పెంచుతుందేగాని సిజేరియన్ అవకాశాన్ని మాత్రం పెంచదు.

 

నా ప్రసూతి సమయాన్ని ఎపిడ్యూరల్ పొడిగిస్తుందా?, నాకు ఫోర్సెప్స్ ప్రసవం అయ్యే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలు సాధారణంగా చాలామంది గర్భిణులు అడుగుతుంటారు. ఇవి చాలా సులభమైన ప్రశ్నలే గాని సమాధానాలు మాత్రం సంక్లిష్టమైనవి. ప్రసూతిపై ఎపిడ్యూరల్ అనస్తీషియా ప్రభావం విషయంలో అనస్తీసియా సంబందిత వ్యక్తుల సముదాయంలో చిన్న చర్చ జరిగింది. దీనికి సంబందించిన పదజాలం కూడా విభజించబడింది. ప్రసూతి వైద్యులు, మిడ్ వైఫ్ లు, రోగులు, ఆసుపత్రి యాజమాన్య సిబ్బంది, బీమా ఎగ్జిక్యూటివ్ లు, పాత్రికేయులు, ఆరోగ్య పాలసీదారుల వంటి వారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్ల కొంతమంది సిజేరియన్ ప్రసవానికి ఎపిడ్యూరల్ అనల్జీసియా ఒక ప్రధాన కారణమని ఆరోపించారు. అనేక రకాల అంశాలు ఈ విషయంలో నిజానిజాలను తేల్చడానికి వీలు లేకుండా అడ్డుకున్నాయి. వాటిలో కొన్ని..

నైతిక పరమైన అంశాలు

అన్నింటికన్నా నైతిక అంశాలదే ప్రధాన పాత్ర. ప్రసూతి కోసం వచ్చిన మహిళలపై నిర్వహించిన ప్రాస్పెక్టివ్ డబుల్ బ్లైండ్ రాండమైజ్డ్ అధ్యయనంలో భాగంగా వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక విభాగం వారికి వారి ఇష్టానుసారం ఎపిడ్యూరల్ ఇచ్చారు. మత్తుమందు తీసుకోవడం ఇష్టంలేని రెండో విభాగం వారికి ఎపిడ్యూరల్ ఇవ్వలేదు. ఈ పద్ధతిలో నొప్పి నుమ్చి ఉపశమనం పొందగోరితే దాన్ని అనైతికతగా భావించడం ఇప్పటికీ ఉంది. అయితే సాధారణంగా ప్రసూతిలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించినప్పుడు ప్రసూతి వైద్యులు ఎపిడ్యూరల్ అనస్తీసియా తీసుకోవడానికి కొంతమందైనా ముందుకొచ్చే అవకాశం ఉంటుందని ఈ అధ్యయనాన్ని రాండమ్ గా చేశారు. అంటే ఎపిడ్యూరల్ తీసుకోవడం ఇష్టంలేని వారిని ఒక గ్రూపుగా, ఇష్టం లేనివారిని మరో గ్రూపుగా విభజించారు.

Inability to perform blinded studies:

Ideally, the evaluators in a study should be blinded to the method of analgesia to eliminate bias. Insurmountable problem is posed by the practical impossibility of blinding patients, obstetricians, nurses, and anesthesiologists to the presence or absence of a functional epidural block. Because of proceeding with operative delivery is ultimately a subjective, clinical decision made by the obstetrician, the absence of masking may be important. Obstetricians and midwives may not treat their patients with epidural analgesia the same way that they treat those without it. For example, forceps – assisted delivery may be more common among patients with epidural analgesia, partly because obstetricians know their patients will be comfortable and have relaxed pelvic musculature for the procedure.

ఎపిడ్యూరల్ తీసుకునేవాళ్లు, తీసుకోని మహిళలల్లోని వ్యక్తిత్వ భేదాలు

ఈ విషయాన్ని మరింత క్లిష్టతరం చేసిన అంశాల్లో ఇది ఒకటి. అధ్యయన సమయంలో ఎపిడ్యూరల్ తీసుకునే విషయంలో ఆయా మహిళల ఇష్టానికే వదిలేసే రెట్రొస్పెక్టివ్ అధ్యయనాల విలువ తగ్గిపోయేందుకు కారణం కూడా ఇదే. ఎపిడ్యూరల్ తీసుకునే వాళ్లు తీసుకోని వారి నుంచి విభేదించడానికి కారణం అనువంశికమైనది. ఎపిడ్యూరల్ అనస్తీసియాను ఇష్టపడే వాళ్లలో సాధారణంగా మొదటిసారి గర్భం దల్చినవాళ్లు(నల్లిపేరస్), ప్రసూతి కోసం చాలా ముందుగానే ఆసుపత్రికి వచ్చిన వాళ్లు, కడుపులో చాలా పైభాగంలో బిడ్డ ఉన్నవాళ్లు, శిశువు పరిమాణం పెద్దగా ఉన్నవాళ్లు, ప్రసూతి నెమ్మదిగా అయ్యేవాళ్లే ఎక్కువ. ఎపిడ్యూరల్ ఇచ్చినా ఇవ్వకున్నా ఈ అన్ని కారణాలూ ప్రసవ సమయం పెరగడానికి దోహదం చేస్తాయి.

అధ్యయనాల సమర్థత

కొన్ని అధ్యయనాలు అంత సమర్థవంతంగా ఉండకపోవడానికి కారణం పరిశీలన కోసం ఎంచుకున్న రోగుల సంఖ్య తక్కువగా ఉండడమే. వీటివల్ల కావాల్సిన మేరకు ఫలితాలు పొందడం కష్టం. అనేక పరిమితుల వల్ల చిన్న అధ్యయనానికి పూర్తి స్థాయిలో ఫలితం పొందలేం. సమర్థవంతమైన డబుల్ బ్లైండ్ రాండమైజ్డ్ అధ్యయనాలు లేకపోయినా ఆధునిక గణన పద్ధతుల ద్వారా (మెటా అనాలసిస్) కొన్ని ముక్తాయింపులను ఇవ్వవచ్చు.

సమగ్ర విశ్లేషణ(మెటా అనాలసిస్)

సారూప్యత కలిగిన వివిధ రకాల అధ్యయనాలలోని లోపాలను అధిగమించడానికి ఆ అధ్యయనాల ఫలితాలను ఆధారం చేసుకుని మెటా అనాలసిస్ చేస్తారు. దీని ద్వారా కింది విషయాలు గమనించవచ్చు.

సిజేరియన్ ప్రసవంపై ఎపిడ్యూరల్ అనస్తీషియా ప్రభావం:

రాండమ్ గా సాగిన అయిదు పరిశీలనలు, రెండు ఇతర అధ్యయనాలను (ప్రిలిమినరీ రిపోర్టు మరియు యూరోపియన్లు చేసిన పాత అధ్యయనం) మెటా అనాలసిస్ చేస్తారు. ఈ విశ్లేషణలో దాదాపు 2400 మంది గర్భిణుల్లో ఎపిడ్యూరల్, ఓపియాయిడ్ అనల్జీసియా గ్రూపుల మధ్య సిజేరియన్ ప్రసవం అవకాశం పెరగడంలో పెద్దగా తేడా కనిపించలేదు. అదేవిధంగా గర్భాశయ ముఖద్వారం విస్తరించడంలో లోపం లేదా ప్రసవ పురోగమనం (డిస్టోషియా)లో లోపం ఉన్నప్పుడు, మొట్టమొదటి ప్రసవం అవుతున్న వాళ్లలో కూడా సిజేరియన్ అవకాశం పెరగడంలో ఎటువంటి మార్పూ లేదు.

ప్రసూతి సమయంపై ఎపిడ్యూరల్ అనస్తీషియా ప్రభావం:

గర్భాశయ ముఖద్వార వ్యాకోచంపై ఎపిడ్యూరల్ అనల్జీసియా ప్రభావం చాలా తక్కువ. అయితే ఎపిడ్యూరల్ అనల్జీసియా, ఓపియాయిడ్ అనల్జీసియాల గ్రూపులను పోలుస్తూ రాండమ్ గా చేసిన 10 అధ్యయనాల విశ్లేషణలో ప్రసూతి మొదటి దశ 42 నిమిషాలు(సుమారు 8 శాతం) పొడిగింపబడినట్టు తేలింది. రాండమ్ గా చేసిన 6 అధ్యయనాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు వీటి ప్రసూతి సమయం సగటు కాలం ఎపిడ్యూరల్ పేషెంట్లలో 14 నిమిషాలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఐవి గ్రూపు వారి కన్నా ఎపిడ్యూరల్ విభాగపు మహిళల్లో దాదాపు గంట కాలం తేడా వచ్చిందన్న మాట.

ఎపిడ్యూరల్ అనల్జీసియా మరియు ఇన్స్ట్రుమెంటల్(ఫోర్సెప్స్ ప్రసవాలు):

ఫోర్సెప్స్ ప్రసవాలు, ఎపిడ్యూరల్ అనల్జీసియా మధ్య సంబంధం చాలా సంక్లిష్టమైనది. ఎపిడ్యూరల్ అనల్జీసియా వల్ల ఇన్స్ట్రుమెంటల్ ప్రసవాలు పెరిగే అవకాశం ఉంది. ప్రసూతి వైద్యులు, ఆసుపత్రుల విధానాలను అనుసరించి ఇది రకరకాలుగా ఉంటుంది. ఎపిడ్యూరల్ అనల్జీసియా రోగుల్లో ఇన్స్ట్రుమెంటల్ ప్రసవాల రేటు రెండొంతులు పెరుగుతుందని రాండమైజ్డ్ అధ్యయనాల విశ్లేషణలో తేలింది. అయితే ప్రసూతి వద్యుల అభిప్రాయాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఫోర్సెప్స్ ప్రసవం వల్లనే రోగి సౌకర్యంగా ఉంటారని ప్రసూతి వైద్యుడు భావిస్తే ఫోర్సెప్స్ ప్రసవాన్నే చేయవచ్చు.

ఆక్సిటోసిన్ వాడకం:

ఐవి గ్రూపు వారి కన్నా ఎపిడ్యూరల్ అనల్జీసియా తీసుకున్న మహిళల్లోనే తరచుగా ఆక్సిటోసిన్ ను వాడుతారు. ఎపిడ్యూరల్ గ్రూపులో మత్తుమందు తీసుకున్న తరువాత ఆక్సిటోసిన్ రెండొంతులు ఎక్కువగా అవసరమవుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది.

రోగి సంత్రుప్తి మరియు శిశువు బయటకు రావడం:

నొప్పి తగ్గేందుకు ఐవి పద్ధతిని అనుసరించిన వారికన్నా ఎపిడ్యూరల్ వారిలో శిశుజననం ఎక్కువ సంత్రుప్తికరంగా ఉంటుంది. ఓపియాయిడ్ గ్రూప్ వారిలో తీవ్ర అసంత్రుప్తి సర్వసాధారణం. అంతేగాక లో-1, 5 నిమిషాల అప్గార్ స్కోర్స్, బొడ్డునాళం పిహెచ్ విలువ తక్కువగా ఉండడం, శిశువుకు నెలాక్సోన్ చికిత్స అవసరం కూడా ఓపియాయిడ్ గ్రూప్ లో సాధారణమేనని మెటా అనాలసిస్ ఫలితాలు చెబుతున్నాయి.

 

చివరి ముక్తాయింపు ఏమిటంటే..

రాండమ్ గా చేసిన రకరకాల అధ్యయనాలు అనేకమంది అనస్తీషియాలజిస్టులు, ప్రసూతి వైద్యుల్లో ఎపిడ్యూరల్ పట్ల విశ్వాసాన్ని అధికం చేస్తున్నాయి. ఎపిడ్యూరల్ అనల్జీసియా ప్రసూతి సమయాన్ని కొంతవరకు పొడగించినా సిజేరియన్ ప్రసవానికి మాత్రం దోహదం చేయదు.

ఎపిడ్యూరల్ అనల్జీసియా తీసుకున్న వాళ్లలో ప్రసూతి సమయం ఎక్కువగా ఉంటుంది. ఐవి పద్ధతిలో కన్నా ఎపిడ్యూరల్ వల్ల తల్లి సంత్రుప్తి, బిడ్డ బయరకు వచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉంటాయి.

టేబుల్ 1: రాండమైజ్డ్ ట్రయల్స్ ఆఫ్ ఎపిడ్యూరల్ వర్సెస్ ఓపియాయిడ్ అనల్జీసియా
మొదటి రచయిత మరియు సైటేషన్డిస్టోషియా కోసం సి/ఎస్ రేటుపి
ఎపిడ్యూరల్ గ్రూపుఓపియాయిడ్ గ్రూపు
ఫిలిప్సెన్
ఇయర్ జె, అబ్స్టెట్., గైనెకాల్ రెప్రాడ్ బయోల్ 1989;30:27-33
10/57 (17%)6/54 (11%)ఎస్ ఎస్
థార్ప్
ఎ ఎం జె అబ్స్టెట్.,గైనెకాల్ 1993;169:851-8
8/48 (16.7%)
1/45 (2.2%)
<0.5
రామిన్
అబ్స్టెట్, గైనెకాల్ 1995;86:783-9
కరెంట్ అనెస్త్ రిపో 2000;2:18-24
43/664 (6%)
37/666 (6%)
ఎస్ ఎస్
శర్మ
అనెస్తీషియాలజీ 1997;87:487-94

13/358 (4%)

16/357 (5%)
ఎస్ ఎస్
బోఫిల్
ఎ ఎం జె అబ్స్టెట్.,గైనెకాల్ 1997;177:1465-70
18.4% (21%) 17.2% (71%)ఎస్ ఎస్
క్లార్క్
ఎ ఎం జె అబ్స్టెట్.,గైనెకాల్ 1998;179:1527-33
4/49 (4%)
3/51 (3%)
ఎస్ ఎస్
గాంబ్లింగ్3
అనెస్తీషియాలజీ 1998;89:1336-44
15/156 (9.6%)
22/162 (13.6%)
ఎస్ ఎస్
లాఫ్ నన్
బిఆర్ జె అనెస్త్ 2000;84:715-9
39/616 (6%)
34/607 (6%)
ఎస్ ఎస్
హోవెల్
బిఆర్ జె అబ్స్టెట్ గైనెకాల్. 2001;108:27-33
36/304 (12%)
40/310 (13%)
ఎస్ ఎస్
ల్యూకాస్4
ఎ ఎం జె అబ్స్టెట్.,గైనెకాల్ 2001;185:970-5
13/184 (7%)
17/185 (9%)
ఎస్ ఎస్

 

టేబుల్2:
సెంటినెల్ అధ్యయనాలతో పోల్చినప్పుడు సి/ఎస్ రేటు ముందు వెనుక ఎపిడ్యూరల్ అందుబాటులో వచ్చిన మార్పు.
మొదటి రచయిత మరియు సైటేషన్డిస్టోషియా కోసం సి/ఎస్ రేటుపి
ఎపిడ్యూరల్ వాడకం
తక్కువ ఉన్న కాలం
ఎపిడ్యూరల్ వాడకం
ఎక్కువ ఉన్న కాలం
బెయిలీ
అనెస్తీషియా 1983;38:282-5
7.1% (0%)9.3% (27%)ఎస్ ఎస్
గ్రిబిల్
అబ్స్టెట్ గైనెకాల్ 1991;78:231-34
9.0% (0%)8.2% (47%)ఎస్ ఎస్
లార్సన్
ఎస్ ఒ పి 1 అబ్ స్ట్రాక్ట్స్ 1992:13
27.5% (0%)22.9% (32%)ఎస్ ఎస్
మంకూసో
ఎస్ ఒ పి 1 అబ్ స్ట్రాక్ట్స్ 1993:13
14.9% (19%) 12.3% (67%)ఎస్ ఎస్
జాన్సన్
జె ఫామ్ ప్రాక్ట్ 1995;40:244-7
18.4% (21%) 17.2% (71%)ఎస్ ఎస్
లయన్
అబ్స్టెట్ గైనెకాల్ 1997;90:135-141
11.8% (13%) 10.0% (59%)ఎస్ ఎస్
ఫోగెల్
అనెస్త్ అనాల్జ్ 1998;87:119-23
9.1% (1%) 9.7% (29%)ఎస్ ఎస్
యాన్సీ
ఎ ఎం జె అబ్స్టెట్.,గైనెకాల్ 1999;180:353-9
19.4% (1%) 19.0% (59%)ఎస్ ఎస్
ఇంపే
ఎ ఎం జె అబ్స్టెట్.,గైనెకాల్ 2000;182:358-63
3.8% (10%) 4.0% (57%)ఎస్ ఎస్

సమాచారం కోసం:

  1. సీగల్ ఎస్, బ్రిన్ బాచ్ డి. ఎపిడ్యూరల్స్ అండ్ సిజేరియన్ డెలివరీస్: ఎ న్యూ లుక్ టు ఎన్ ఓల్డ్ ప్రాబ్లెమ్. ఎడిటోరియల్. అనెస్తీషియా అండ్ అనల్జీషియా 2000; 94:775
  2. హాల్పెర్న్ ఎస్ హెచ్, లెయిటాన్మ్ బిఎల్, ఒహిసన్ ఎ, బ్యారెట్ జె ఎఫ్, రైస్ ఎ. ఎఫెక్ట్ ఆఫ్ ఎపిడ్యూరల్ వర్సెస్ పేరెంటరల్ ఓపియాయిడ్ అనెల్జీసియా ఆన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్. జె ఎ ఎం ఎ 1996;280;2105
  3. సీగల్ ఎస్. ఎపిడ్యూరల్ అనెల్జీసియా అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ఔట్ కమ్ ఆఫ్ లేబర్ అండ్ డెలివరీ. ప్రాబ్లమ్స్ ఇన్ అనెస్తీషియా. 1999;11:324
  4. థార్ప్ జె ఎ, హెచ్ యు డిహెచ్, ఆల్బిన్ ఆర్ ఎం, ఇటాల్. ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంట్రాపార్టమ్ ఎపిడ్యూరల్ అనెల్జీసియా ఆన్ నల్లిపేరస్ లేబర్: ఎ రాండమైజ్డ్, కంట్రోల్డ్, ప్రోస్పెక్టివ్ ట్రయల్. అబ్స్టెట్ గైనెకాల్ 1993; 169:851-8.
  5. రామిన ఎస్ ఎం, గాబ్లింగ్ డ్ ఆర్, ల్యూకాస్ ఎంజె, శర్మ ఎస్ కె ఇటాల్. రాండమైజ్డ్ ట్రయల్ ఆఫ్ ఎపిడ్యూరల్ వర్సెస్ ఇంట్రావీనస్ అనల్జీసియా డ్యూరింగ్ లేబర్. అబ్స్టెట్ గైనెకాల్ 1995; 86:783-9.
  6. ఫిలిప్సెన్ టి,జెన్సెన్ ఎన్ హెచ్. ఎపిడ్యూరల్ బ్లాక్ ఆర్ పేరెంటరల్ పెథడిన్ యాజ్ అనల్జ్ెసిక్ ఇన్ లేబర్. ఎ రాండమైజ్డ్ కన్సర్నింగ్ ప్రోగ్రెస్ ఇన్ లేబర్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్. ఎయుర్ జె అబ్స్టెట్ గైనెకాల్ రెప్రాడ్ బయోల్ 1989;30:27-33.
  7. శర్మ ఎస్ కె, సిడావి జె ఇ, రామిన్ ఎస్ ఎమ్, ల్యూకాస్ ఎంజె, లావెనో కెజె, ఇటాల్. సిజేరియన్ డెలివరీ; ఎ రాండమైజ్డ్ ట్రయల్ ఆఫ్ ఎపిడ్యూరల్ వర్సెస్ పేషంట్-కంట్రోల్డ్ మెపిరిడిన్ అనల్జీసియా డ్యూరింగ్ లేబర్. అనెస్తీషియాలజీ 1997;87:487-94.
  8. బోఫిల్ జె ఎ, విన్సెట్ ఆర్ డి, రాస్ ఇ ఎల్, ఇటాల్. నల్లిపేరస్ యాక్టివ్ లేబర్, ఎపిడ్యూరల్ అనెల్జీసియా అండ్ సిజేరియన్ డెలివరీ ఫర్ డిస్టోషియా. ఎ ఎమ్ జె అబ్స్టెట్ గైనెకాల్ 1997;177:1465-70.
  9. క్లార్క్ ఎ, క్యార్ డి. లోయ్డ్ జి, కుక్ వి, స్పినాటో జె. ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ఎపిడ్యూరల్ అనల్జీసియా ఆన్ సిజేరియన్ డెలివరీ రేట్స్: ఎ రాండమైజ్డ్, ప్రాస్పెక్టివ్ క్లినికల్ ట్రయల్. ఎ ఎం జె అబ్స్టెట్ గైనెకాల్ 1998; 179:1527-33.

    తరువాత అంశం కోసం దిగువ క్లిక్ చేయండి.



తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD