www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

ప్రసూతి సమయంలో తినడం, తాగడం గురించి ఎందుకంత శ్రద్ధ పెట్టాలి?

మనం తీసుకున్న ఆహారం, తేలికపాటి ద్రవాహారమైనా మత్తుమందు తీసుకున్నప్పుడు పొట్ట నుంచి శ్వాసమార్గాల వైపు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిపట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని(లంగ్ యాస్పిరేషన్) బొమ్మలో చూపినవిధంగా ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం కలుగవచ్చు.

 

 

 


 

ప్రసూతి సమయంలో నోటి ద్వారా తీసుకునే పదార్థాల గురించిన జాగ్రత్తలు

ఘనాహారాన్ని అసలు తీసుకోకూడదు. స్వచ్చమైన ద్రవపదార్థాలను మాత్రం తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ద్రవాహారాన్ని తీసుకోవడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండడం లేదు. ఇటీవల అమెరికన్ అనస్తీశియాలజిస్టుల సంఘం ప్రదురించిన అనస్తీషియాలజీలో దీన్ని ప్రోత్సహించారు. ప్రసవకాలంలో ఉపవాసం ఉండడం వల్ల అనేక దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉందని, అందుకే కొంతవరకు స్వచ్చమైన ద్రవాలను ఆహారంగా తీసుకోవడం సురక్షితమేనని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.

 

గర్భిణీ స్త్రీ ఉపవాసం

1. స్వచ్చమైన ద్రవాలు: నోటి ద్వారా ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల తల్లికి సౌకర్యంగా ఉంటుంది.
సూచనలు: ప్రసవం క్లిష్టంగా లేనివారికి నీరు, గుజ్జు తీసిన పండ్లరసాలు బివరేజేస్, పాలు కలపని టీ, బ్లాక్ కాఫీల వంటి ద్రవాలను ఇవ్వవచ్చు. కాని యాస్పిరేషనె కు గురయ్యే అవకాశం ఉన్నవారికి మాత్రం ద్రవాహారంలో సైతం కొన్ని పరిమితులున్నాయి. స్థూలకాయం, మధుమేహం, శ్వాసలో ఇబ్బందుల వంటి అనారోగ్యాలున్నప్పుడు గాని, ప్రసవం కష్టంగా ఉన్నప్పుడు గాని ద్రవాహారమే అయినా వారి ఇష్టానుసారం తీసుకోకూడదు. వారిని చూసుకోవడానికి నియమించిన నిపుణుల సలహా ప్రకారం తీసుకోవాలి.

మా శిక్షణ కేంద్రంలో రోగులకు పండ్ల రసాలు, సూప్ లాంటి తేలికపాటి ఆహారాన్ని అందిస్తాం. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఇతర ఘనాహారానికి దూరంగా ఉంచుతాం. ఎపిడ్యురల్ ట్యూబ్(క్యాథటర్)ను అమర్చి, ప్రసవం అయ్యే వరకు అనుక్షణం మీరు డెలివరీ యూనిట్ పర్యవేక్షణలో ఉంటారు.

రీజినల్ అనస్తీషియా ఇచ్చిన తరువాత మాత్రం నోటి ద్వారా తీసుకునే పదర్థాలను 8 ఒజెడ్/హెచ్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. పండ్లరసాలు, పాలు కలపని టీ, కాఫీలు, కార్బన్ డయాక్సైడ్ కలపని ద్రవాలను మాత్రమే ఇవ్వాలి. వ్యక్తిగత శ్రద్ధలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా అనస్తీషియాలజిస్టు దీనికి విరుద్ధంగా చేయకూడదు.

2. ఘనపదార్థాలు: ప్రసవ సమయం సమీపించిన గర్భిణులకు ఘనాహారాన్ని నివారించాలి. సమస్యల్లేకుండా సిజేరియన్ డెలివరీ అయ్యే వారికి కూడా కనీసం 8 గంటల ముందు నుంచి ఘనాహారం ఇవ్వకూడదు.

ఏది ఏమైనా మిమ్మల్ని చూసుకోవడానికి నియమితులైన వారి సలహా ప్రకారం మాత్రమే ఆహారం తీసుకోవాలి.

సర్జరీ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల శిశుజనన సమయంలో ట్యూబులు ఒకదానికొకటి కలిసిపోయే అవకాశం ఉంది. అందువల్ల నీరు తప్ప ఇతర ఏ విధమైన ద్రవాలనైనా సర్జరీకి 8 గంటల ముందువరకు తీసుకోకూడదు.


తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD