www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth


జనరల్ అనస్తీషియా ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలి?

లోకల్ లేదా రీజనల్ అనస్తీషియాకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో జనరల్ అనస్తీషియా ఇస్తారు. ఒక్కోసారి సిజేరియన్ చేయాల్సిన అత్యవసర పరిస్థితుల్లో రీజనల్ అనస్తీషియా ఇవ్వడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని ఎంచుకుంటారు. రక్తస్రావం సమస్య ఉన్నప్పుడు కూడా జనరల్ అనస్తీషియా అవసరం అవుతుంది. కొన్నిసార్లు రీజనల్ అనస్తీషియా మోతాదు అవసరమైన మేరకు సరిపోకపోవచ్చు. అప్పుడు కూడా జనరల్ అనస్తీషియా ఇవ్వాల్సి వస్తుంది.

జనరల్ అనస్తీషియా శిశువుకు సురక్షితమైనదేనా?

తల్లి మత్తుగా నిద్ర పోవడానికి దోహదం చేసే ఈ మత్తుమందులు శిశువుకు ఏవిధమైన హానీ తలపెట్టవు. నిజానికి ఈ మత్తు మందు శిశువుపై చూపే ప్రభావం స్వల్పమే. అదికూడా నిద్రపుచ్చే మోతాదే. ఎందుకంటే శిశువుపై మత్తుమందు తన ప్రభావం చూపాలంటే అది మెదడుకు చేరాలి. కాని శిశువును కూడా నిద్రకు గురిచేసే మోతాదులో మందు శిశువు మెదడుకు చేరే అవకాశం చాలా తక్కువ. కాబట్టి తల్లి హాయిగా నిద్రపోతున్నా శిశువు మాత్రం పుట్టిన తరువాత చలాకీగా, చురుగ్గా ఉండి ఏడుస్తాడు.

అయితే మత్తుమందు ఇవ్వడం వల్ల శ్వాస, రక్తపీడనం, హ్రుదయస్పందనల రేటు వంటి ముఖ్యమైన జీవక్రియల్లో మార్పులు కలుగుతాయి. అందుకే అనస్తీషియాలజిస్ట్ ఎలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి మత్తుమందు వల్ల శిశువుకు హాని జరుగుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. అయితే జనరల్ అనస్తీషియా తీసుకోవాల్సిన కారణాన్ని బట్టి ఒక్కోసారి శిశువుపై మత్తుమందు ప్రభావం చూపే అవకాశం ఉంది.

జనరల్ అనస్తీషియా ఇచ్చే విధానం


 


జనరల్ అనస్తీషియా అంటే ఏమిటి? ఎలా ఇస్తారు?

జనరల్ అనస్తీషియా ద్వారా సిరలోకి మందును పంపిస్తారు. దీనివల్ల చాలా వేగంగా మత్తులోకి జారుకుంటారు. ఆపరేషన్ గదిలోకి తీసుకువచ్చిన తరువాత బీపీ కఫ్, ఆక్సీజన్ మానిటర్, ఇకెజి/ గుండెకు సంబంధించిన మానిటర్(రొమ్ము భాగంలో కొన్ని స్టిక్కర్స్ ను పెడతారు) లాంటి మానిటర్లను ముందు జాగ్రత్తగా అమరుస్తారు. మీరు వెల్లకిలా ఒకవైపు కొద్దిగా వంగి పడుకోవాలి. అన్నీ అమర్చిన తరువాత ఆక్సిజన్ మాస్క్ ద్వారా శ్వాస తీసుకోమని చెబుతారు. నోరు, ముక్కులపై ఈ మాస్కు కప్పి ఉంటుంది. తరువాత ఇంట్రావీనస్ క్యాథటర్ సహాయంతో సిరలోకి మత్తుమందును ఎక్కిస్తారు. వెంటనే మీరు నిద్రలోకి జారుకుంటారు.

మత్తులో ఉన్నప్పుడు శ్వాసలో తేడా వస్తుంది కాబట్టి నోటి ద్వారా గాలి లోపలికి వెళ్లడానికి ఒక ట్యూబును (శ్వాసగొట్టం) అమరుస్తారు. ఈ ట్యూబు వాయునాళం(ట్రాకియా) కింది వరకూ వెళ్తుంది. గాలి ఈ వాయునాళం ద్వారానే ఊపిరితిత్తులకు చేరుతుంది. దీనివల్ల తల్లికి, బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. నిద్రపోతున్నప్పుడు కడుపులో ఉన్న పదార్థాలు తిరిగి ఆహారనాళంలోకి వచ్చి(రిగర్జిటేషన్) ఊపిరితిత్తులు గాయపడకుండా కూడా ఈ ట్యూబు రక్షిస్తుంది. నోటి ద్వారా ఆక్సిజన్ అందడానికి ట్యూబును అమర్చిన అనంతరం నిద్రపోవడానికి మత్తుమందును పీల్చుకునేలా చేస్తారు. ఆ తరువాత మత్తులో ఉన్నారా లేదా మేలుకునే ఉన్నారా అన్నది నిర్ధారణ చేసుకోవడం కోసం నొప్పి కలిగించే మందును తిరిగి సిర ద్వారా పంపిస్తారు.

సర్జరీ అయిపోయిన తరువాత ఇచ్చే మందుల వల్ల నిద్రావస్థ నుంచి మెల్లగా బయటకొస్తారు. స్వయంగా శ్వాస తీసుకోగలుగుతారు. మీరు మేలుకోగానే నోట్లో నుంచి శ్వాసగొట్టం(ఎయిర్ వే ట్యూబు) తీసేసి తేలిగ్గా ఉండే ప్లాస్టిక్ ఆక్సిజన్ మాస్కు తగిలిస్తారు.

జనరల్ అనస్తీషియా సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటి?

తల్లి కడుపులో ఏదైనా ఆహారం ఉందా లేదా అన్నది అన్నింటి కన్నా ప్రధానమైనది. ఎందుకంటే స్ప్రుహలో లేనప్పుడు యాస్పిరేషన్ ప్రక్రియ ద్వారా కడుపులో ఉన్నవి పైకి ఉబికివచ్చే ప్రమాదం ఉంది. ఇవి ఊపిరితిత్తులకు చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా న్యూమోనియా వంటి శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి.(దీని గురించి పూర్తి వివరాలకు 'ప్రసవ సమయంలో నేను తినవచ్చా/తాగవచ్చా?' అనే యానిమేషన్ చూడండి). అందువల్ల కడుపులోని ఆమ్లాలను తటస్థపరచడానికి యాంటాసిడ్ మందులను ఇవ్వడం. అనస్తీషియా ఇచ్చిన తరువాత వాయునాళం(ట్రాకియా)లో శ్వాసగొట్టాన్ని అమర్చడం వంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల రిగర్జిటేషన్ ప్రక్రియను (తిన్న పదార్థాలు పైకి ఉబికి రావడం) నివారించే వీలుంటుంది.

శస్త్రచికిత్స సమయంలో మత్తులో ఉండడం వల్ల నాకేమైనా గుర్తుంటుందా?
(జ్ణాపకశక్తి ఏమైనా దెబ్బతింటుందా?)

శస్త్రచికిత్స సమయంలో పడుకుని ఉండడం వల్ల అప్పుడు జరిగిన విషయాలేవీ తరువాత గుర్తుండడం చాలా అరుదు. శ్వాసగొట్టం(ఎయిర్ వే ట్యూబు) తీసివేసేటప్పుడు మాత్రం కొందరు జ్ణాపకం ఉంచుకోగలుగుతారు.


తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD