నేపథ్యం

చాలా రకాల యానిమేషన్లతో కూడిన వెబ్ సైటు ఇది. ఇలాంటి వెబ్ సైట్లలో ఇదే మొదటిది. సులువుగా అర్దం చేసుకోవడానికి ఈ యానిమేషన్లు తోడ్పడుతాయన్నది నా నమ్మకం. శిశుజనన సమయంలో నొప్పికి సంబంధించిన విషయాలు, నొప్పి నివారణ పద్దతులు ఇక్కడ ఇచ్చిన యానిమేషన్ బొమ్మల ద్వారా సులభంగా అర్ధం అవుతాయి. విషయసూచికలో తెలిపినట్టుగా వెబ్ సైటును వివిధరకాల విభాగాలుగా విభజించడమైనది. వర్గీకరణ విధానాన్ని అనుసరించి ఒక్కొక్కటిగా బ్రౌజ్ చేయవచ్చు. లేకుంటే మీకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకుని (రెండుసార్లు క్లిక్ చేసి) చదువుకోవచ్చు.

'ప్రసూతి ఎపిడ్యూరల్ అనల్జీషియా' వంటి పేరు పొందిన నొప్పి నివారణ పధ్దతుల గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్సైటు అందిస్తుంది. మందులను ఉపయోగించకుండా సహజసిధ్ధ ప్రసవానికి ఉపయోగపడే పద్దతులు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి సంబందించిన 'లింక్'ను అందించే విభాగం కూడా ఇందులో పొందుపరచడమైనది. సిజేరియన్ ప్రసవానికి మరోవిభాగంఉంది. ప్రతీవిభాగంలో యానిమేషన్లు, ముఖ్యాంశాలు(హైలైట్స్), తత్సంబంధమైన ఇతర అంశాలన్ని ఉంటాయి. సరికొత్త సమాచారాన్ని అందించడానికి అప్పుడప్పుడూ వెబ్సైటులో మార్పుచేర్పులు అవసరమవుతాయి.

పరిచయం

రీజినల్ అనస్తీషియా సహాయంతో 1900 జూలై నెలలో మొట్టమొదటి సారిగా నొప్పిలేని ప్రసవం జరిగినట్టు చరిత్ర చెబుతున్నది. అప్పటినుంచి నొప్పిలేని ప్రసవాన్ని కోరుకునే తల్లులకోసం ఈ దిశగా చాలా క్రుషి జరిగింది. 'సొసైటీ ఆఫ్ అబ్స్టెట్రిక్ అనస్తీషియ అండ్ పెరినెటాలజీ'(ఎస్ఒఎపి-సోప్), అంకితభావం కలిగిన కొంత మంది అనస్తీషియాలజిస్టులు, వృత్తిసంస్థల(ప్రొఫెషనల్సొసైటీస్) నేతృత్వంలో గత శతాబ్దకాలంగా సురక్షితమైన రీజినల్ అనస్తీషియా చాలా అభివృద్దిచెందింది. రీజినల్ అనస్తీషియాలో కొత్తపద్దతులు, వివిధరకాల మందులు, వాటిని అందించే పద్దతులు, ప్రసూతి అనస్తీషియా, నర్సింగ్ సిబ్బందివల్ల ఈ శతాబ్దంలో చాలా మంది సురక్షితమైన రీజినల్ అనెస్తీషియా ద్వారా నొప్పిలేకుండా ప్రసవించగలిగారు.

ప్రపంచ వ్యాప్తంగా 2000 సంవత్సరంలో సుమారు రెండు మిలియన్ల మంది ఎపిడ్యూరల్ అనల్జీసియాను తీసుకున్నారు. 1992లో ఎపిడ్యూరల్ అనల్జీసియా తీసుకున్నవారు సగటున 51 శాతం మంది ఉంటారు. అదృష్టవశాత్తు ఈ శకంలో నొప్పి లేని ప్రసవాలను ఒప్పుకోగలుగుతున్నారు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్ స్టెట్రిక్ అండ్ గైనకాలజీ శిశుజనన సమయంలో నొప్పి నివారణ గురించి తన కమిటీ అభిప్రాయం 118లో ఇలా వ్యక్తపరిచింది:"చాలామంది మహిళల్లో ప్రసూతి చాలా నొప్పితో కూడి ఉంటుంది. వైద్యుని సంరక్షణలో సురక్షితమైన జోక్యానికి అవకాశం ఉండి అంతటి నొప్పిని భరించవలసిన అవసరం లేదు.

నొప్పుల సమయంలో బాధానివారణకోసం తల్లికోరినంతనే వైద్యులు సహాయం అందించవచ్చు. "ఈ సంస్థ విశ్వాసం ప్రకారం" ప్రసూతి సమయంలో వాడే నొప్పి నివారణ పద్దతుల్లో నడుముకు ఇచ్చే ఎపిడ్యూరల్ బ్లాక్ అన్నింటికన్నా మెరుగైనది. ఎందుకంటే ఇది మెదడు చురుకుదనంపై తక్కువ దుష్ప్రభావం చూపుతుంది. తల్లిని పూర్తి స్పృహలో ఉంచుతుంది."శిశువుకోసం ప్రణాళిక సిద్దం చేసుకునే ముందు మీ సందేహనివ్రుత్తి కోసం మీ వైద్యులను సంప్రదించడం అవసరమని గుర్తించండి.

నిర్వచనాలు

అనల్జీషియా: నొప్పినుంచి పాక్షికంగా లేదా పూర్తిగా ఉపశమనం కలిగించేదే అనల్జీసియా.

అనస్తీషియా: కండరాల కదలికలతో సహా అన్ని రకాలుగా స్పర్శఙ్ణానాన్ని అడ్డగించడానికి వాడేదే అనస్తీషియా.

 

భవానీ శంకర్ కొడాలి ఎం.డి.

capnoman@gmai.com

 

ఇతర సమాచారం కోసం
1. Datta S.Childbirth and pain relief. Next Decade, Inc.2001

References
1. Hawkins JL et al. Anesthesialogy 1997; 87:135 3. Giving birth in U.S. freep/news/health
4. Gogarten W, Van Aken, H.A Centurey of regional analgesia in obstetrics.
Anesthesia and Analgesia 2000:91:733.

Click below to begin