www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

కొన్ని వేల సంవత్సరాలుగా బాధా నివారణకోసం, వ్యసనాల నుంచి విముక్తి చేయడంకోసం, వాంతుల నివారణకోసం, ఇంకా ఇతర వ్యాధుల చికిత్స కోసం సూదిపొడుపు వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రసూతి వైద్యంలో, ముఖ్యంగా నొప్పులను నియంత్రించడంలో దీని ఉపయోగం గురించి చెప్పుకోదగిన అద్యయనాలేవీ అందుబాటులో లేవు. ఎంత సమర్థంగా పనిచేస్తుందో రుజువు చేసే ఆధారాలు లేవు. మన దేహంలో 12 శక్తి పథాలు ఉంటే, అందులో 365కి పైగా బిందు కేంద్రాలు ఉన్నట్టు శాస్త్రం చెబుతున్నది. శస్త్ర చికిత్స,నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగి దేహంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఆ అసమతౌల్యం బాధను, అబ్బందిని కలిగిస్తుంది. శస్త్ర చికిత్స లేక నొప్పుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగినప్పుడు

కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో సూదులను పొడవడం ద్వారా శక్తిని సరైన మార్గంలోకి మళ్లేట్టు చేస్తారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంచనా ప్రకారం, ఆక్యుపంచర్ ఈ బాధ కలిగించే స్పందనలను మెదడుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. లేక శరీరంలో సహజంగానే బాధానివారణ రసాయనాలను ఉత్త్పత్తి చేస్తుంది.

టెక్నిక్:

ఈ చికిత్సా విధానంలో నిపుణుడైన ఆక్యుపంచర్ వైద్యుడు పేషంటు దేహంలోని కీలకమైన శక్తి బిందువుల వద్ద చర్మం కింది భాగంలో శుద్దిచేసిన మంచి సూదులను గుచ్చుతారు. ఒక్కో బిందువు వద్ద ఒక్కో వ్యవధి సూదులను శరీరంలో ఉంచుతారు. కొన్నిసార్లు సూదుల ద్వారా తక్కువ తీవ్రతతో విద్యుత్ ప్రవాహాన్నీ పంపించి, బాధ తీవ్రతను నియంత్రించడానికి కృషి చేస్తారు. ప్రసూతికి చాలా వారాల ముందు నుంచే వారానికి గంట చొప్పున ఆక్యుపంచర్ చేయవచ్చు.

పరిమితులు:

  • ఆక్యుపంచర్ వైద్యుడు మాత్రమే సూదులను ప్రయోగించవలసి ఉంటుంది.
  • సూదులు గుచ్చిన చోట అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.
  • నొప్పుల సమయంలో సూదులు గుచ్చితే,తల్లి అటూ ఇటూ కదలడం కష్టమవుతుంది.
  • ఆక్యుపంచర్ వల్ల బాధ తగ్గడం కంటే, కడుపులో వికారం కలిగి తొందరగా ప్రసవం జరగడానికి వీలు కలిగే అవకాశం ఉందని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • ఆక్యుపంచర్ బాధా నివారణ ఔషధాల వినియోగం, స్థానికంగా మత్తు ఇవ్వడం(రీజినల్ అనస్తీసియా) వంటి వాటిని తగ్గించిన దాఖలాలు తక్కువ.

ఆక్యుపంచర్ వల్ల శరీరంలో సహజ బాధానివారణ రసాయనాలేవి(ఎండోమార్ఫిన్స్) జనించడంలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక ప్రసూతికి ముందు వారాల తరబడి ఆక్యుపంచర్ చికిత్స తీసుకున్నవారిలో తొలిదశ నొప్పుల్ వ్యవధి తగ్గిపోయిందని కూడా ఆ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను కచ్చితమైనవిగా పరిగణించడానికి లేదు. ఈ అంశంపై సందేహాలను తొలగించడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉంది.

ఇటీవల స్వీడన్ లో ఒక అధ్యయనం జరిగింది. స్వీడిష్ ప్రసూతి వైద్యులు గర్భిణులపై నాలుగురోజులపాటు ఆక్యుపంచర్ ఉపయోగించి చూశారు. ఆక్యుపంచర్ తీసుకున్న మహిళలల్లో ఎప్పటిలాగే సగం మంది ఎపిడ్యురల్ అనస్తీసియాను కోరుకున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడయింది. బాధా నివారణకోసం నాడీ స్పందనలను పెంచే చికిత్సలనో, వేడి బియ్యం సంచిని ఉపయోగించే విధానాన్నో వారు కోరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలినట్టు బ్రిటిష్ జోర్నల్ ఆఫ్ అబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ తాజా సంచిక పేర్కొంది.

పై సమాచారం దిగువ పేర్కొన్న ప్రచురణల నుంచి స్వీకరించడం జరిగింది. ఆక్యుపంచర్ పై మరిన్ని వివరాలకోసం ఈ పత్రాలను చదవడమే గాక, మీ ప్రసూతి వైద్యులను చర్చించగలరు.

  • గోర్స్కి.టి, డస్ ఆక్యుపంచర్ అఫెక్ట్ లేబర్ అండ్ డెలివరి? ఎస్ సి ఐ రెవ ఆల్ట్ మెడి 3(1):42-45, 1999. (సి) 1999 ప్రమోథియస్ బుక్స్.
  • రామ్ నెరో.ఎ, హాన్సన్.యు, కిల్రెన్.ఎం, ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ డ్యూరింగ్ లేబర్- ఎ రాండమైస్డ్ కంట్రోల్డ్ ట్రయల్. బిజెఓజి(ఇంగ్లాండు), జూన్ 2002, 109(6), పేజీ6-44.
  • ఈపెన్. ఎస్, రాబిన్స్.డి, నాన్ ఫార్మాలాజికల్ మీన్స్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఫర్ లేబర్ అండ్ డెలివరీ, ఇంటర్నేషనల్ ఆనస్తీసియాల్ క్లిని, 2002 ఫాల్; 40(4): 103-14, రివ్యూ.
  • ముర్రే ఎన్ కిన్, ఎ గైడ్ టు ఎఫెక్టివ్ కేర్ ఇన్ ప్రిగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, థర్డ్ ఎడిషన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2000



తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి  

Copyright © 2018 - Bhavani Shankar Kodali MD