www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

ఎపిడ్యూరల్ పద్ధతా లేక ఐ.వి. విధానమా?

 వెన్నుపూస పైపొరకు ఇచ్చే అనస్తీసియా (Epidural)

 

శిశువుపై తక్కువ ప్రభావం కలిగించే విధానం ఏదీ?

వెన్నుపూస పైపొరకు ఇచ్చే అనస్తీసియా ప్రభావం శిశువుపై ఎలా ఉంటుంది? ఎపిడ్యూరల్ అనస్తీసియాను రెండు విధాలుగా అమలు చేయవచ్చు. ఒకటి వెన్నుపూస పైపొరకు అనస్తీసియా ఇవ్వడం, రెండు మాదక ద్రవ్యాలు ఉపయోగించడం. వెన్నుపూస పై పొరకు ఇచ్చే అనస్తీసియా తల్లి రక్త ప్రసరణ ద్వారా శిశువుకు చేరుతుంది. అయితే శిశువుకు చేరే అనస్తీసియా తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. శిశువు హ్రుదయ స్పందనలపై ఎటువంటి ప్రభావం చూపించదు. జననం తర్వాత శిశువు చురుకుదనం కూడా తగ్గదు. అదేవిధంగా సూది ద్వారా వెన్నుపూస పైపొరపై ఇచ్చే మాదకద్రవ్యాలు కూడా శిశువును చేరతాయి. అయితే ఐ.వి. విధానంలో ఇచ్చే మాదకద్రవ్యాలతో పోల్చితే ఈ విధానంలో కూడా శిశువుకు చేరే ఔషధాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఐ.వి. విధానంలో ఉపయోగించే ఔషధంలో చాలా తక్కువ మోతాదు ఔషధాన్ని మాత్రమే వెన్నుపూస పైపొరకు ఇచ్చే సూదిలో ఉపయోగిస్తారు.

అప్పుడప్పుడూ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇచ్చిన పది, పదిహేను నిమిషాల తర్వాత శిశువు గుండెకొట్టుకునే రేటులో మార్పులు వస్తాయి. గుండె కొట్టుకునే రేటుతో మార్పుతో నిమిత్తం లేకుండా గుండె కొట్టుకోవడం నెమ్మదించవచ్చు. ఇలా 30 శాతం ప్రసూతి మహిళల్లో సంభవించవచ్చు. బాధా నివారణ చర్యలు చేపట్టకముందు ఆ మహిళలు తీవ్రంగా నొప్పికి, మానసిక ఒత్తిడికి గురికావడం వంటి అంశాలు ఇందుకు ప్రధానకారణంగా కనిపిస్తున్నది. అయితే శిశువు గుండెకొట్టుకోవడంలో మార్పులు నాలుగైదు నిమిషాలకు మించి ఉండకపోవచ్చు. శిశువు గుండె స్పందనలను నిరంతరం పర్యవేక్షిస్తూ, దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఈ మార్పులను గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన పనిలేదు.

ఎపిడ్యూరల్ విధానంవల్ల కలిగే మరో ప్రభావం ఏమంటే, తల్లి రక్తపోటు తగ్గిపోవడం. ఇది మరీ ఎక్కువగా ఉండి, వెంటనే చికిత్స చేయకపోతే, శిశువుపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే ఎపిడ్యూరల్ అనస్తీసియా ఇచ్చిన తర్వాత నిరంతరాయంగా రక్తపోటును కొలవడమే కాక, అవసరమైతే ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు కాబట్టి,ఈ విషయంలో కూడా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు.

నొప్పి నివారణ పద్ధతులను అనుసరించడంవల్ల జన్మించిన అప్పుడే పుట్టిన పసికందుల ప్రవర్తనను అధ్యయనంచేయగా పరస్పరం విరుద్ధమైన ఫలితాలు వెలుగుచూశాయి. ఇటీవలికాలంలో ఎపిడ్యూరల్ అనస్తీసియా డోసులను బాగా తగ్గించి వేసినట్టు అధ్యయనంలో తేలింది. ఇప్పుడు అమలులో ఉన్న డోసు వల్ల సాధారణ పరిస్థితుల్లో శిశువు పై ఎపిడ్యూరల్ అనస్తీసియా ప్రభావం చాలా స్వల్పం. క్లినికల్ గా దానిని అసలు పరిగణనలోకి తీసుకొనవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఎపిడ్యూరల్ అనస్తీసియా వల్ల నొప్పుల సమయంలో శిశువులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

 

ఐ.వి. విధానంలో ఉపయోగించే ఔషధాల ప్రభావం శిశువుపై ఎలా ఉంటుంది?

ఐ.వి. విధానంలో ఇచ్చే ఔషధాలన్నీ మావి(ప్లాసెంటా)ని దాటుకుని శిశువును చేరతాయి. దీంతో అవి శిశువుపై కూడా కొంత ప్రభావం చూపుతాయి. శిశువు గుండె కొట్టుకునే రేటులో కూడా స్వల్పంగా మార్పులు రావచ్చు. అయినా ఈ కారణంగా గుండె పనిచేసే విధానానికి పెద్దగా హాని జరగదు.

ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం ఏమంటే, ఐవి ఔషధాలు శిశువును వ్యాకులపరిచే అవకాశాలు ఉండడం. ఏ ఔషధం ఇస్తున్నాం, ఎంత డోసు ఇస్తున్నాం, ఏ సమయంలో ఇస్తున్నాం అన్న అంశాలపై శిశువుపై ప్రభావం చూపడం ఆధారపడి ఉంటుంది. ఔషధాల ప్రభావం వ్యాప్తి చెందకముందే శిశువు జనిస్తే, ఔషధాల ప్రభావం పరిమితంగా ఉంటుంది. శిశువు సాధారణంగా ఉండవచ్చు. లేదంటే స్వల్పంగా నిద్రలో ఉండవచ్చు. కొన్ని వారాలపాటు పిల్లవాడి ప్రవర్తనలో తాత్కాలిక మార్పులు ఉండవచ్చు. అలాగాక పిల్లవాడిపై ఔషధాల ప్రభావం ఎక్కువగా ఉంటే శ్వాస దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు శిశువైద్య నిపుణుడిని సంప్రదించవలసి రావచ్చు. సకాలంలో ఇవ్వడం, తగిన డోసు ఇవ్వడం ద్వారా శిశువుపై ఐ.వి. ఔషధాల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

సంప్రదించవలసిన గ్రంధాలు:

1. కోహెన్ ఎస్ ఇ, టాన్ ఎస్, ఆల్ బ్రైట్ జిఎ, ఎపిడ్యూరల్ ఫెటానీ/బ్యూపీవకెయిన్ మిక్సర్స్ ఫర్ ఆబ్స్టెరిక్ అనల్జీసియా, అనస్తీసియాలజీ, 1987;67:403

2. విస్కోమి సిఎం, హుడ్ డిడి, మెలోని పిజె,;ఫెటల్ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఆఫ్టర్ ఎపిడ్యూరల్ ఫెటాని డ్యూరింగ్ లేబర్. అనస్తీసియా అండ్ అనల్జీసియా 1987; 71:679

3. జోపిలా పి, జోపిలా ఆర్, హాల్ మాన్ ఎ, కోవులా ఎ; లుంబార్ ఎపిడ్యూరల్ అనల్జీసియా టు ఇంప్రూవ్ ఇంటర్విల్లస్ బ్లడ్ ఫ్లో డ్యూరింగ్ లేబర్ ఇన్ సివియర్ ప్రిక్లాంప్సియా. ఆబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ 1982; 59:158

4. హోడ్కిన్సన్ ఆర్, భట్ ఎం, వాంగ్ సిఎన్; డబుల్ బ్లైండ్ కంపారిజన్ ఆఫ్ న్యూరో బిహేవియర్ ఆఫ్ నియోనేట్ ఫాలోయింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిఫరెంట్ డోసెస్ ఆఫ్ మెపిరిడైన్ టు ది మదర్. కెన్. అనస్త్. సొ.జోర్నల్ 1978; 25:405తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 

 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD