www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

కొన్ని సందర్భాలలో గర్భిణులు ఔషదాలు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. అనస్తీసియా తీసుకోవడానికి కూడా నిరాకరించవచ్చు. అసలు కొన్ని ప్రాంతాలలో ఇవేవి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటువంటి సందర్భాలలో తల్లులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ బాధానివారణ పద్దతులను ఎంచుకోవచ్చు. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు బాధానివారణకు తోడ్పడతాయని వారు నమ్ముతున్నారు కూడా. ఈ ప్రత్యామ్నాయ పద్దతులను గురించి సంక్షిప్తంగా వివరించడంతోపాటు, వాటిని గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవసరమైన లింకులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని నాన్ ఫార్మాకాలజిక్ బాధా నివారణ మార్గాలుగా వ్యవహరిస్తారు. ఈ పద్దతులను గురిమ్చి ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా వ్యక్తమయిన అభిప్రాయాలను సంగ్రహంగా ఇక్కడ పొందుపరుస్తున్నాము:

సుగంధ చికిత్స (ఆరోమాపతి)
సమ్మోహన చికిత్స (హిప్నోథెరపి)
శ్వాస చికిత్స (లామేజ్)
జల చికిత్స (బాతింగ్)
సూదిపొడుపు వైద్యం (ఆక్యుపంచర్)
నాడీ స్పందన చికిత్స (ట్రాన్స్కుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్(టెన్స్))
స్పర్ష, మర్ధన (టచ్, మర్ధన)
నొప్పుల సమయంలో తల్లిని వివిధ భంగిమల్లో కశిలించడం (మాటర్నల్ మూవ్మెంట్ అండ్ పొజిషనల్ చేంజెస్ డ్యూరింగ్ లేబర్)

 

తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి

Copyright © 2018 - Bhavani Shankar Kodali MD